SUBMIT LYRICS
Top 100
Album releases
artists
Community
French
Spanish
Portuguese
Correction Lyrics
Deva Maa Kutumbamu
by
Traditional
Back
Lyrics
దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు మాకేమి భయము – మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము లోకాశలు వీడి – లోకంబులోన నీ మందగా ఉందుము సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా మమ్ములను బలపరచుము ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి ఫల సంపదలతోను – కలకాలము జీవించ కురుపించుము నీ దీవెనలన్ పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్ నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో సంతసంబుగ సాగెదము వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము కొంత కాలమే మేము – ఉందుము లోకాన చెంత చేరగ కోరెదము నీ చెంత చేరగ కోరెదము
music video
Your name will be published. Leave fields blanks to remain anonymous.
Submit
Modal title
×
Insert media
Video URL?
(YouTube, Vimeo, Instagram, DailyMotion, Soundcloud)
×
Remember me
Lost password
Sign in
Register